ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంక్షలు ఇక మరింత కఠినం.. తప్పితే శిక్షలు ఖాయం - high alert in kadapa district

కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కడప జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు రోడ్లపై తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రెడ్​ జోన్లు ప్రకటించిన ప్రాంతాల్లో ఎవ్వరూ రాకపోకలు చేయకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిత్యావసర సరుకుల కొనుగోలును ఉదయం 11 గంటల వరకే అనుమతించారు.

red zone in kadapa districts
కడప జిల్లా అంతటా హైఅలర్ట్​

By

Published : Apr 2, 2020, 4:45 PM IST

ప్రొద్దుటూరులో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రొద్దుటూరు పరిధిని రెడ్ జోన్​గా ప్రకటించారు. ప్రజలు రోడ్లపైన తిరగకుండా ఇంటికే పరిమితం అయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ప్రొద్దటూరులో 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వాహనాలను అనుమతించడం లేదని డీఎస్పీ సుధాకర్ స్పష్టం చేశారు.

మైదుకూరులో..

కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల మైదుకూరులో పోలీసు అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన టాస్క్ ఫోర్స్​ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే కూరగాయలు, కిరాణా దుకాణాలకు అనుమతించారు. అత్యవసర పరిస్థితి తప్పితే ప్రజలు ఎవరు రోడ్లపైకి రాకుండా చేశారు. అనుమానాస్పదంగా రోడ్ల పై తిరిగిన వారిని అడ్డుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిర్దేశించిన సమయంలో కాకుండా మిగిలిన సమయాల్లో ఎవరైనా రహదారిపైకి చేరితే వాహనాలను జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.

రైల్వే కోడూరులో..

మండల స్థాయి అధికారులు సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసుల తో పాటు నియోజకవర్గ స్థాయి అధికారులు, మండల స్థాయి రెవెన్యూ అధికారులు, మండల స్థాయి వైద్య అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని కోరారు.

ఇదీ చదవండి:

కరోనాపై.. అనుక్షణం పోలీసులు అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details