అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను కడప జిల్లా సిద్దవటంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్దూరు అటవీశాఖ బీట్లో తనిఖీలు చేస్తుండగా టైర్లు పంచర్లు అయినా లారీ తారసపడింది. అందులో సోదా చేయగా 280కిపైగా ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీలు గమనించిన స్మగ్లర్లు అప్పటికే పరారై పోయారు. వీటిని అటవీశాఖ కార్యాలయానికి ప్రత్యేక వాహనంలో తరలించారు. అక్రమరవాణా వెనుక ఎవరి హస్తం ఉంది? లారీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అనే ఈ విషయంపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
రెచ్చిపోయిన స్మగర్లు.... 280 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కడప జిల్లా సిద్ధవటం రేంజ్ లోని మద్దూర్ బీట్ వద్ద అక్రమంగా రవాణా అవుతున్న ఎర్రచందనం దుంగల లారీని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
రెచ్చిపోయిన స్మగర్లు.... 280 ఎర్రచందనం దుంగలు స్వాధీనం