అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమకు సమాన అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని "రాయలసీమ ప్రజా సంఘాల ఐక్య వేదిక" డిమాండ్ చేసింది. శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమకు హైకోర్టు లేదా రాజధాని ఏర్పాటు చేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ మేరకు కడప కలెక్టరేట్ వద్ద రాయలసీమ ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో "రాయలసీమ సంకల్ప దీక్ష" నిర్వహించారు. ఈ దీక్షకు రాయలసీమ జిల్లాలతో పాటు, ప్రకాశం, నెల్లూరు నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈనెల 20న అసెంబ్లీలో సీఎం జగన్...తీసుకునే నిర్ణయం రాయలసీమకు న్యాయం చేసే విధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
'రాయలసీమకు సమాన అవకాశాలు కల్పించాలి'
కడప కలెక్టరేట్ వద్ద రాయలసీమ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో "రాయలసీమ సంకల్ప దీక్ష" నిర్వహించారు. ఈ దీక్షకు రాయలసీమ జిల్లాలతో పాటు, ప్రకాశం, నెల్లూరు నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అధికార వికేంద్రీకరణ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తామంతా స్వాగతిస్తున్నామని నాయకులు తెలిపారు.
ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆద్వర్యంలో "రాయలసీమ సంకల్ప దీక్ష"