కడపలో వర్షాలు-రైతుల్లో ఆనందం కడపలో ఉదయం నుంచి ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. ఆకాశమంతా నల్లటి మబ్బులతో కమ్ముకొంది. చాలా రోజుల తర్వాత వర్షం కురవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరువుతో అల్లాడుతున్న కడప జిల్లా వాసులకు ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది. ఇదివరకే ఇతర జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, నదులు, వాగులు జలాశయాలకు నీరు వచ్చి చేరింది. దీనికి తోడు వర్షం కురవడంతో ప్రజలు మరింత సంబరపడుతున్నారు.