కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ప్రభుత్వం కరోనా వైరస్ నిరోధానికి లాక్ డౌన్ ప్రకటించడంతో రైల్వేకోడూరు పట్టణంలోని దుకాణాలు అన్ని మూతబడ్డాయి. ప్రజలు ఎవర్ని ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం పోలీస్ అధికారులు ఎన్ని చెప్పినా కొందరు యువకులు ప్రజలు అనేక కారణాలు చెప్పి పట్టణంలోకి వస్తున్నారు. అటువంటివారిని స్థానిక సీఐ ఆనంద్ రావు ఎస్సై వెంకట నరసింహం కొందరు మోటార్ సైకిళ్లను సీజ్ చేసి కొందరు యువకులకు జరిమానా విధించారు. ప్రజలు ప్రభుత్వం తెలిపిన 6 నుంచి 9 గంటల వరకే కావలసిన సరుకులు కానీ ఇతరత్రా వస్తువులు కొనుక్కోవాలని, చిన్న చిన్న కారణాలతో రోడ్డుపైకి రాకూడదని ప్రజలు అందరూ సహకరించాలని పోలీసులు సూచించారు.
'నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు' - @corona ap cases
కడప జిల్లా రైల్వేకోడూరులో పోలీసులు లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి మోటర్సైకిళ్లను సీజ్ చేశారు.
రైల్వేకోడురులో వాహనాలు సీజ్ చేస్తున్న పోలీసులు