ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుజరాత్​ రైతులకు మద్దతుగా కడపలో ధర్నా

పెప్సీ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపిస్తూ కడప సీపీఎం, సీఐటీయు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆందోళనకు దిగారు.

గుజరాత్​ రైతులకు మద్దతుగా కడపలో ధర్నా

By

Published : Apr 30, 2019, 4:56 PM IST

గుజరాత్​ రైతులకు మద్దతుగా కడపలో ధర్నా

రైతులపై... స్వయాన భారత ప్రధానమంత్రి అక్రమ కేసులు పెట్టడం దారుణమని కడప సీపీఎం, సీఐటీయు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెప్సీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. గుజరాత్​లో రైతులపై పెట్టినవి అక్రమ కేసులని స్పష్టం చేశారు. వాటిని ఎత్తివేయాలని... పెప్సీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుజరాత్ లో రైతులు బంగాళాదుంపలు పండించే లేదనే కారణంతో వారిపై కేసులు బనాయించడం దారుణమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details