ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాకు టికెట్ ఇవ్వకుంటే...!'

కడప జిల్లా ప్రొద్దుటూరు తెదేపా టికెట్ వ్య‌వ‌హారంలో నేత‌ల నుంచి రోజుకో ప్ర‌క‌ట‌న వెలువ‌డుతోంది. నిన్న‌టి రోజు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజ‌లురెడ్డి త‌న‌కే అధిష్టానం టికెట్ కేటాయిస్తుంద‌ని ఢంకా బ‌జాయించి చెప్పారు. తాజాగా.. మరో మాజీ ఎమ్మెల్యే మ‌ల్లెల లింగారెడ్డి కూడా పార్టీ టికెట్ త‌న‌కే వస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే మ‌ల్లెల లింగారెడ్డి

By

Published : Mar 5, 2019, 7:48 PM IST

ప్రొద్దుటూరు రాజకీయం రోజుకో మలుపు

కడప జిల్లాప్రొద్దుటూరు తెదేపా టికెట్ వ్య‌వ‌హారంలో నేత‌ల నుంచి రోజుకో ప్ర‌క‌ట‌న వెలువ‌డుతోంది. నిన్న‌ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజ‌లురెడ్డి త‌న‌కే అధిష్టానం టికెట్ కేటాయిస్తుంద‌ని ఢంకా బ‌జాయించి చెప్పారు. ఇప్పుడు మ‌రో మాజీ ఎమ్మెల్యే మ‌ల్లెల లింగారెడ్డి.. పార్టీ త‌న‌కే టికెట్ ఇస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. క‌ష్ట‌కాలంలో పార్టీ కోసం ప‌నిచేసిన నాయ‌కుడిని రాష్ట్రంలో తానొక్క‌డినేన‌ని లింగారెడ్డి చెప్పారు. పార్టీ చేపట్టిన అన్ని స‌ర్వేలు త‌న‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని స్పష్టం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్‌ను త్యాగం చేశాన‌ని, ఇప్పుడు త్యాగం చేసే ప‌రిస్థితిలో లేన‌ని లింగారెడ్డి తేల్చేశారు.టికెట్ ఇస్తే 30 నుంచి 40 వేల మెజార్టీతో గెలుస్తాన‌ని, ఇవ్వ‌క‌పోతే ఇవే ఓట్లు తెదేపాఅసెంబ్లీ, పార్ల‌మెంటు సీట్ల విష‌యంలో మైన‌స్ అవుతాయ‌ని పార్టీని హెచ్చ‌రించే ధోర‌ణిలో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.
కడప గడపలో ఎగిరే జెండా ఏది?

ABOUT THE AUTHOR

...view details