ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.1.87 లక్షల విలువైల ఎర్రచందనం పట్టివేత

కడప జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటికి చెందిన వ్యక్తి ఈ వ్యవహారం వెనక ఉన్నట్టు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

By

Published : Aug 5, 2019, 10:50 AM IST

ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని రోళ్లమడుగు ప్రాంతంలో అక్రమంగా రవాణా చేస్తున్న 15 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. డిఎఫ్ఓ కి అందిన సమాచారంతో రోళ్లమడుగు ప్రాంతంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. అప్పటికే ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా తయారుచేసి రవాణాకు సిద్ధంగా ఉంచారని... తాము మూకుమ్మడిగా దాడిచేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారని, మరో నలుగురు వ్యక్తులు పరారయ్యారని రాజంపేట రేంజర్ శ్రీనివాసులు తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు రాయచోటికి చెందిన వారు కాగా మిగతా వ్యక్తులు అనంతపురానికి చెందిన వారని తెలిపారు. పట్టుకున్న దుంగల విలువ 1,87,533వేల రూపాయలు ఉందని రేంజర్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details