కడపలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నా... కొంత మంది బాధ్యతారాహిత్యంగా మాస్కులు ధరించటం లేదు. అటువంటి వారిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో మాస్కు లేకుండా రహదారులపైకి వచ్చిన వారికి జరిమానాలు విధించారు. సుమారు సోమవారం ఒక్కరోజే 494 కేసులు నమోదు చేసి... 1,08,620 రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వెల్లడించారు.
కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని అన్బురాజన్ పిలుపునిచ్చారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. కొంతమంది అలంకార ప్రాయంగా మాస్కును వాడుతున్నారనీ... అది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమేనని హెచ్చరించారు.