కరోనా వ్యాప్తి నివారణ కోసం చేపట్టిన లాక్‌డౌన్ అన్నివర్గాల మీద తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికీ చాలామంది కోలుకోలేని పరిస్థితి నెలకొంది. అలాంటి వారిలో చిరువ్యాపారులు ముందు వరుసలో ఉంటారు.వారంతా ప్రతి రోజూ వ్యాపారం చేస్తే కానీ బతుకు బండి ముందుకు సాగని దుస్థితి. అలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ముందుకువచ్చింది. పీఎం స్వనిధి పేరుతో 7 శాతం వడ్డీతో రూ. 10 వేల రుణం అందించేందుకు సిద్ధమైంది.
ఎవరు అర్హులు?
కడప జిల్లాలో చిరువ్యాపారులు వేల సంఖ్యలో ఉన్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది మార్చి 24 కంటే ముందునుంచే వ్యాపారం జరుపుతున్న చిరు వ్యాపారులంతా పీఎం స్వనిధి పథకానికి అర్హులని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా గుర్తింపు పత్రాలు పొందిన 4,298 మంది చిరువ్యాపారులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ ఎవరైనా అర్హులై ఉండి గుర్తింపు పత్రాలు పొందకపోయినా వడ్డీ రాయితీతో రుణాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అర్హులందరికీ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వీలుగా రుణాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించి, ఆ దిశగా ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా గుర్తించిన చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించేందుకు ఇప్పటికే సంఘాలు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ లబ్ధి వేరుగా..