మొదలైన దేహదారుఢ్య పరీక్షలు
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కడప మున్సిపల్ మైదానంలో మొదలయ్యాయి. ఈ నెల 27 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి.
కడప మున్సిపల్ మైదానంలో పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ఉదయం 5 గంటలకు ప్రారంభమైనాయి. జిల్లా వ్యాప్తంగా 5వేల మంది ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులై..శారీరక దారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వీరిలో 600మంది మహిళలు ఉన్నారు. మొదట అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు, తర్వాత ఎత్తు పరిశీలన, అనంతరం 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తున్నారు. రోజుకు 900 మంది హాజరవుతారని జిల్లా పోలీస్ అధికారి రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. ఫిబ్రవరి 22 నుంచి 27 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి.