ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లాక్​డౌన్​'తో నిత్యావసరాలకు గిరాకీ

రాష్ట్రమంతా లాక్​డౌన్ ప్రకటించినందున కడప జిల్లా రైల్వేకోడూరులో నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇలా జనాలు గుంపులుగా గుమికూడుతున్నందున వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

People's commotion with the purchase of essentials in the railway station
రైల్వేకోడూరులో నిత్యావసరాల కొనుగోలుతో ప్రజల సందడి

By

Published : Mar 23, 2020, 12:07 PM IST

రైల్వేకోడూరులో నిత్యావసరాల కొనుగోలుతో ప్రజల సందడి

జనతా కర్ఫ్యూ సందర్భంగా నిన్న నిర్మానుష్యంగా మారిన రైల్వేకోడూరు పట్టణంలో ఈరోజు దుకాణాలు, హోటళ్లు తెరుచుకున్నాయి. నిత్యావసర సరుకులు కొనుగోలుకు ప్రజలు భారీగా పట్టణానికి వస్తున్నారు. పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే గానీ జన సమూహాలను కట్టడి చేయడం అసాధ్యమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని, దుకాణాలను మూసివేయాలని సూచించారు శిక్షణా డీఎస్పీ ప్రసాదరావు అన్నారు. వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్​ను తరిమికొట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details