ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ప్రజలు సహకరిస్తే రాష్ట్రంలో కరోనా కేసులు కొత్తగా నమోదయ్యే అవకాశం ఉండదని కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా కేసులు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే నమోదవుతున్న నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు ఆయా ప్రాంతాల్లో మాస్కులు, శానిటైజర్ల పంపిణీకి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామాలను దత్తత తీసుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వీయనిర్భందం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.
'ప్రజలు లాక్డౌన్కు సహకరిస్తే...వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు'
స్వీయ నిర్భందం ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 14 వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు లాక్డౌన్కు సహకరిస్తే...వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు