ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎండుగడ్డికి నిప్పుపెట్టారు.. పసుపు పంట బూడిదైంది!

కడప జిల్లా గంజికుంటలో గుర్తు తెలియని వ్యక్తులు ఎండుగడ్డికి నిప్పు పెట్టిన కారణంగా మంటలు విస్తరించాయి. ఇద్దరు రైతుల పసుపు పంటకు నష్టం వాటిల్లింది.

పసుపు

By

Published : May 9, 2019, 10:54 PM IST

ఎండుగడ్డికి నిప్పుపెడితే.. కాలిన పసుపు పంట

కడప జిల్లా మైదుకూరు మండలం గంజికుంటలో గుర్తుతెలియని వ్యక్తులు ఏపుగా పెరిగిన గడ్డికి నిప్పుపెట్టారు. వేసవి ప్రభావంతో.. మంటలు వేగంగా విస్తరించాయి. పక్కనే ఉన్న పసుపు పంటకు అంటుకున్నాయి. సుమారు రెండున్నర ఎకరాల్లో పంట కాలిపోయింది. మంటల వేడికి భూమి వేడెక్కి భూమిలో ఉన్న పసుపుకొమ్ములు ఉడికిపోయినట్టు రైతులు తెలిపారు. సుమారు 8 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. మరో వారం రోజుల్లో పంట చేతికి వస్తుందనుకుంటున్న తరుణంలో.. ఇలా జరిగిందని వాపోయారు. ఎకరాకు లక్షన్నర రూపాయలు పెట్టుబడి పెట్టామని.. తమకు ఎంతో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు మంటలు ఎక్కవ దూరం విస్తరించకుండా అదుపులోకి తెచ్చారు. రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని స్థానిక నాయకులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details