కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద ఆర్టీసీ బస్సు కింద పడి కర్నూలు జిల్లా చక్రవర్తలు పల్లెకు చెందిన రాజగోపాల్ రెడ్డి అనే యువకుడు మృతి చెందాడు.గుడిపాడులోని అత్తవారింటి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై రాజగోపాల్ రెడ్డి బయలుదేరాడు.గుడిపాడు వద్దకు వచ్చేసరికి ఆర్టీసీ బస్సును తప్పించడానికి ప్రయత్నించే సమయంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో అదుపుతప్పి బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు కిందపడి వాహనదారుడు మృతి - కడప
ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో బస్సు కింద పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ విషాధకర సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
బస్సు కిందపడి వాహనదారుడు మృతి