కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు సమీపంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి వస్తున్న లారీ... తిరుపతి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ గోపాల్ రాజు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంతో రోడ్డుకు ఇరు వైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రాకపోకలను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడపలో బస్సు లారీ ఢీ... ప్రయాణికులు క్షేమం - bus accident at kadapa rajampeta news
కడప జిల్లా రాజంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి వస్తున్న లారీ... తిరుపతి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలు కాగా... ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
కడపలో బస్సు లారీ ఢీ