ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నవ దంపతులకు తప్పిన ప్రమాదం - accident

కడప జిల్లా జెడ్ కొత్త పల్లి వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నవ దంపతులు త్రుటిలో  పెద్ద ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని ప్రత్యేక వాహనంలో బద్వేలు లోనీ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

దంపతులు

By

Published : Aug 2, 2019, 11:54 PM IST

బద్వేలులోని హబూబ్​నగర్​కు చెందిన ఆస్మాకు చెన్నూరులోని మహమ్మద్ యూసుఫ్​తో 5 రోజుల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ టాటా సుమో వాహనంలో చెన్నూరుకి బయలుదేరారు. జెట్ కొత్తపల్లె వద్దకు రాగానే రోడ్డుపై ఆగి ఉన్న లారీ వెనుక వైపు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న టాటా సుమో వాహన ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. భార్యభర్తలిద్దరూ గాయాలతో బయటపడ్డారు. బద్వేలులోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details