ముఖ్యమంత్రి వైయస్ జగన్ 2017వ సంవత్సరంలో నవంబర్ 6న మొదలుపెట్టిన పాదయాత్రకు మూడు సంవత్సరాలు పూర్తయినందున...యాత్రకు సంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. అందులో భాగంగా ఇవాళ లింగాల గ్రామం నుంచి పార్నపల్లె రిజర్వాయర్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారమయ్యే వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం తన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని... వారికి ఉపయోగపడే విధంగా మేనిఫెస్టోను తయరుచేసి... 90 శాతం హమీలను సంవత్సరంలోపు అమలుపరిచి చరిత్రలో నిలిచారని అవినాష్ కొనియాడారు. చిత్రావతి రిజర్వాయర్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పది టీఎంసీల నీటితో నింపడం జరిగిందని... అందుకే ఈ రోజు లింగాల నుంచి పార్నపల్లి రిజర్వాయర్ వరకు పాదయాత్ర చేయడం జరిగిందని వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రిజర్వాయర్లో 10 టీఎంసీల నీటిని నింపడానికి...నాలుగు గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద 240 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన గండికోట ఎత్తిపోతల పథకం పనులు...ఆయన కాలంలోనే 80 శాతం పూర్తయ్యాయని....ఆ తర్వాత మిగిలిన పనులను పూర్తి చేయడానికి గత పాలకులకు పది సంవత్సరాలు పట్టిందని విమర్శించారు.