ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీ మిథున్​ రెడ్డి సహకారంతో 37 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ వితరణ - ఎంపీ మిథున్ రెడ్డి

ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో 37 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ వితరణ చేశామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కడల జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి పీహెచ్​సీకి రెండు చొప్పున వాటిని అందజేస్తామన్నారు.

ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ అందజేత
MP Mithun Reddy provide 37 Oxygen Concentrators

By

Published : May 29, 2021, 6:02 PM IST

ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర దాతల సహకారంతో కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి పీహెచ్​సీ​కీ రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందచేస్తామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నాల్గో విడతలో భాగంగా ఇవాళ 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందచేశారు. ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరారు. గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సందర్శన సందర్భంగా ఎంపీ ఇచ్చిన హామీ మేరకు 37 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇవ్వగా.. ఇతర దాతలు మరో 7 అందజేశారు.

ఇందుకు గానూ ఎంపీ మిథున్ రెడ్డి, దాతలు గీదర భూషణ్ రెడ్డి, రాయలసీమ ఆనంద రెడ్డిలకు శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ అందించిన రూ. కోటి నిధులతో రాయచోటి ఏరియా ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభ మవుతాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్​లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details