మెుదటిసారిగా బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన టిప్పుసుల్తాన్ను గుర్తుంచుకోవాలని... కడప జిల్లా ముస్లిం సంఘం అధ్యక్షులు సత్తార్ పేర్కొన్నారు. ఈ మేరకు కడప ప్రెస్‌క్లబ్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1750లో కర్ణాటకలో జన్మించిన టిప్పు సుల్తాన్... లోహపు కవచాలను ధరించి మెుదటిసారిగా యుద్ధం చేశారని గుర్తుచేశారు. మత సామరస్యాన్ని పాటించిన వ్యక్తి టిప్పు సుల్తాన్ అని కొనియాడారు. మైసూరులో చర్చి కట్టించిన ఘనత టిప్పు సుల్తాన్‌కే దక్కిందన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహన్ని కడపలో ఏర్పాటు చేయాలని కోరారు.
'కడపలో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలి' - కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలి
కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘం జిల్లా అధ్యక్షులు సత్తార్ కోరారు. ఈ మేరకు కడపలో ప్రెస్‌క్లబ్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సమావేశంలో మాట్లాడుతున్న సత్తార్