రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 30 వేల మెజార్టీతో గెలుపొంది తీరుతానని కడప జిల్లా ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే ఎం.లింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో పార్టీ 3వ సారి టికెట్ కేటాయించడంపై అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తనని గెలిపిస్తాయని,... కార్యకర్తల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. తనతో పాటు కడప తెదేపా లోక్సభ అభ్యర్థికిప్రొద్దుటూరులో 30 వేల మెజార్టీ తెప్పిస్తానని ఆయన అన్నారు.