రెండు లారీలు ఢీ... ముగ్గురు మృతి కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు వద్ద రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నై నుంచి కడపకు వెళ్తోన్న లారీని, మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ లారీ పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ ఇంట్లో ఉన్న వెంకట నరసయ్య అనే వ్యక్తి ప్రమాదంలో మృతి చెందాడు. లారీ డ్రైవర్ మహమ్మద్, లారీలో ప్రయాణిస్తున్న పూల వ్యాపారి ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో లారీలోని వ్యక్తులు గాయపడ్డారు. వీరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రహదారిపై స్పీడ్ బ్రేకర్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తూ... ఆందోళనకు దిగారు. ఈ ప్రమాదం వల్ల జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి.
ఇదీ చదవండి :