రైతులు భయపడుతున్నట్లుగానే కడప జిల్లా మైదుకూరు మండలం ఎల్లంపల్లె వద్ద మిడతల దండు కనిపించింది. పశుగ్రాసం కోసం సాగు చేసిన జొన్నపంటపై మిడతల దండు దాడి మొదలైంది. నాలుగురోజుల కిందట తక్కువ సంఖ్యలో ఉన్న ఆ దండు.. మంగళవారం పెద్దగా కనిపించిందని రైతులు అంటున్నారు. మిడతలు ఆకులు తినడంతో మొక్కకు ఈనెలు కనిపిస్తున్నాయని తెలిపారు. మిడతలను తోలేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందంటున్నారు.
కడప జిల్లాలో మిడతల దండు..ఆందోళనలో రైతన్నలు
కడప జిల్లా మైదుకూరు మండలం ఎల్లంపల్లెలో కనిపించిన మిడతల దండు రైతుల్ని కలవరపెడుతోంది. పశుగ్రాసం కోసం వేసిన జొన్నపంటపై మిడతల దండు కనిపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ దండు ప్రభావం తీవ్రం కాకముందే నివారణ చర్యలు చేపట్టాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
కడప జిల్లా రైతుల్ని కలవరపెడుతున్న మిడతల దండు
పశుగ్రాసం సాగు చేసిన పొలానికి సమీపంలోనే పత్తి, కంది పంటలు ఉన్నా వాటిపై మిడతల దండు వాలలేదు. వాటిపై కూడా మున్ముందు మిడతల ప్రభావం ఉంటుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలోనే మిడతల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి :రాపాక రాజకీయ ఊసరవెల్లి: పోతిన మహేశ్