లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవని కడప జిల్లా రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి హెచ్చరించారు. లాక్డౌన్ సడలింపులతో కేసులు పెరుగుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దుకాణ యజమానులు ప్రభుత్వ నిబంధనలను పాటించకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. సడలింపు ఇచ్చారు కదా.. అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. కనీస జాగ్రత్తలు పాటించి కరోనా వ్యాప్తి నివారణను సహకరించాలని కోరారు.
'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ' - కడప జిల్లాలో మద్యం స్వాధీనం
కరోనా కేసుల పెరుగుదలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా డీఎస్పీ తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు '