ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం' - Let's oppose railway privatization

భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో రైల్వేల ద్వారా గమ్యస్థానాలకు కోట్ల మంది చేరుకుంటున్నారని... డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ అన్నారు. రైల్వే ప్రైవేటీకరణ యత్నం సరికాదంటూ ఆందోళనకు దిగారు.

Let's oppose railway privatization ..
రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం...

By

Published : Jul 16, 2020, 3:38 PM IST

భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో రైల్వేల ద్వారా గమ్యస్థానాలకు కోట్ల మంది చేరుకుంటున్నారని... డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ చెప్పారు. రైల్వేలో 109 లైన్లు 151 రైళ్లను ప్రైవేట్ వాళ్లకు అప్పజెప్పడానికి... మోదీ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం సరికాదన్నారు.రైల్వే ప్రైవేటీకరణ జరిగితే సామాజికంగా వెనుకబడిన దళితులు, గిరిజనులు రాబోయే కాలంలో ఉద్యోగాలకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే రైల్వే ప్రైవేటీకరణ కోసం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు కడప జిల్లా జమ్మలమడుగు రైల్వే స్టేషన్ ముందు నిరసన తెలిపారు. స్టేషన్ మాస్టర్ ఉదయ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details