ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్‌ చేరిన ఎనిమిదో నిజాం పార్థివ దేహం.. అంత్యక్రియలకు ఏర్పాట్లు.. - AP news

Eighth Nizam Mukarram Jha Death updates: ఎనిమిదో నిజాం ముకర్రం ఝా పార్థివ దేహం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అక్కడి నుంచి పార్థివ దేహాన్ని చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించారు. సీఎం కేసీఆర్‌.. చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకొని ముకర్రం భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.

Nizam Mukarram Jha
హైదరాబాద్‌ చేరిన ఎనిమిదో నిజాం పార్థివ దేహం

By

Published : Jan 17, 2023, 8:14 PM IST

హైదరాబాద్‌ చేరిన ఎనిమిదో నిజాం పార్థివ దేహం

Eighth Nizam Mukarram Jha Death updates: ఏడో నిజాం మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌ మనవడు, చివరి నిజాం అయిన ప్రిన్స్‌ మీర్‌ అలీఖాన్‌ ముకర్రమ్‌ ఝా బహదూర్‌ (మీర్‌ బరాకత్‌ అలీఖాన్‌) (89) శనివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

ముకర్రం ఝా పార్థివ దేహం హైదరాబాద్‌‌కు చేరుకుంది. ఇస్తాంబుల్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని శంషాబాద్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించారు. ఇవాళ నిజాం కుటుంబీకులు, బంధువులకు మాత్రమే చూసేందుకు అధికారులు అనుమతిచ్చారు. రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిజాం అభిమానులు.. ముకర్రం ఝా పార్థివదేహాన్ని చూసేందుకు అనుమతించనున్నారు.

అనంతరం రేపు మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. చౌమహల్లా ప్యాలెస్‌ నుంచి మక్కామసీదు వరకు యాత్ర కొనసాగి.. ముకర్రం ఝా పూర్వీకులైన నిజాం సమాధుల పక్కనే ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు. ఈ క్రమంలో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు నేటి నుంచే మొదలుపెట్టారు.

చౌమహల్లా ప్యాలెస్‌కు ఎనిమిదో నిజాం ముకర్రం ఝా పార్థివ దేహం చేరుకోవడంతో.. సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. ముకర్రం భౌతిక కాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, ఎంపీ సంతోష్‌ తదితరులు ముకర్రం ఝా పార్థివ దేహానికి నివాళులర్పించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details