సంక్రాంతి సంబరాలు కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిగాయి. భోగి, మకర పండగల అనంతరం శుక్రవారం కనుమ పండగను ప్రజలు వైభవోపేతంగా నిర్వహించారు. గ్రామాలలో వ్యవసాయదారులు, పశుపోషకులు.. పశువులను సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు.
కన్నుల విందుగా కనుమ... చిట్లా కుప్పల వద్ద ప్రజల సందడి
కడప జిల్లాలో సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకున్నారు. కనుమ పండుగ రోజున రాయచోటి నియోజకవర్గంలో పశువులను అలంకరించి... చిట్లాకుప్పల వద్దకు తీసుకవచ్చి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి సమీప గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.
కన్నుల విందుగా కనుమ... చిట్లా కుప్పల వద్ద ప్రజల సందడి
సాయంత్రం ఊర్ల శివారులో కాటమరాజు గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అలంకరించిన పశువులను ఆలయ సమీపంలో వేసిన చిట్లా కుప్పల వద్దకు తీసుకొచ్చి కుప్పలకు శాస్త్రోక్తంగా నిప్పంటించారు. కొందరు యువకులు పశువులను పట్టుకొని వాటికి అలంకరించిన డబ్బు నోట్లు తీసుకునేందుకు పోటీ పడ్డారు. చిట్లా కుప్పలలో గుమ్మడి కాయలు, కొబ్బరి చిప్పలు వేసి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. ఈ దృశ్యాలను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలి వచ్చారు.
ఇదీ చదవండి