కడప జిల్లా కమలాపురం మార్కెట్ యార్డు ఆవరణలో సుమారు కోటి రూపాయల వ్యయంతో మారుజొల్లా శ్రీనివాసులు రెడ్డి నిర్మించిన 20 గదుల షాపింగ్ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. మార్కెట్ యార్డును అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. రైతుబజార్, శీతల గిడ్డంగి కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. కొద్దిరోజుల్లోనే రైతు బజార్‌కు భూమి పూజ కూడా చేస్తామన్నారు.
కమలాపురంలో షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే - కమలాపురంలో మార్కెట్ యార్డు షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్
కడప జిల్లా కమలాపురంలో మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. రైతుబజార్, శీతల గిడ్డంగి కాంప్లెక్స్ ఏర్పాటు చర్యలు చేపట్టామన్నారు. కమలాపురం అభివృద్ధి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
mla ravindra reddy
ఇప్పటికే డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని, వాటిని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్యెల్యే తెలిపారు. కమలాపురం అభివృద్ధికి రింగురోడ్డు, ఆర్వోబీ, ఆర్యుబీ, రోడ్డు విస్తరణ, తాగునీరు, ఆసుపత్రి విస్తరణ పనులు చేపడుతున్నామని చెప్పారు.
ఇదీ చదవండి :కర్నూలులో తుంగభద్ర పుష్కరాల సందడి