ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక నిల్వలు పెంచాలని కలెక్టర్ ఆదేశాలు

వినియోగదారులకు ఇసుక కొరత లేకుండా అన్ని స్టాక్​ పాయింట్లలో నిల్వలు పెంచాలని కడప జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అనేక కొత్త ప్రాజెక్టులు వస్తున్న కారణంగా ఇసుక నిల్వలు పెంచాలని సూచించారు. కొత్తగా ఎనిమిది రీచ్​లు గుర్తించామని అధికారులు కలెకర్ట్​కు తెలిపారు.

kadapa dist collector
kadapa dist collector

By

Published : Nov 9, 2020, 11:00 PM IST

కడప జిల్లాలో ఉన్న అన్ని స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలను పెంచాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో జేసీ (రెవెన్యూ) గౌతమితో కలిసి.. కలెక్టర్ సి.హరికిరణ్ జిల్లా స్థాయి శాండ్ కమిటీ (డీఎల్ఎస్​సీ) సమావేశాన్ని నిర్వహించారు.

వినియోగదారులకు ఎలాంటి కొరత లేకుండా జిల్లాలోని అన్ని ఇసుక డిపోలలో నిల్వలు పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో అనేక కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక నిల్వలు పెంచాలని ఆదేశించారు. ఇసుక డోర్ డెలివరీ నిర్వహణ నిరంతరాయంగా సాగించాలని సూచించారు.

కొత్తగా 8 ఇసుక రీచ్​లు

రాష్ట్ర ప్రభుత్వ ఇసుక పాలసీ -2019కి అనుగుణంగా జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాలైన వేంపల్లి మండల పరిధిలోని ఇడుపులపాయ, కొండాపురం మండలంలోని పొట్టిపాడు, బెడుదూరు రీచ్​లుగా గుర్తించారు. ప్రొద్దుటూరు మండలంలోని రేగులపల్లి, సిద్దవటం మండల పరిధిలోని జంగాలపల్లి-2, నందలూరు మండపం పరిధిలో ఆడపూరు-3, కుమారునిపల్లి-1, కుమారునిపల్లి-2, కుమారునిపల్లి-3.. మొదలైన ఎనిమిది ఇసుక రీచ్​లను కొత్తగా గుర్తించామని అధికారులు కలెక్టర్​కు తెలిపారు.

ఇదీ చదవండి

అమరావతి చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details