ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పని గంటలు పెంచడం రాజ్యాంగ వ్యతిరేకం' - Kadapa

ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పని గంటలు పెంచే ప్రతిపాదనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Increasing working hours is unconstitutional
పని గంటలు పెంచడం రాజ్యాంగ వ్యతిరేకం

By

Published : May 12, 2020, 5:21 PM IST

కరోనాను సాకుగా చూపి కార్మిక చట్టాలను వెయ్యి రోజుల పాటు రద్దు చేయాలని కొన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంపై కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో తహసీల్దారు కార్యాలయం ఎదుట సీపీఐ, ఏఐటీయూసీ, మానవ హక్కుల వేదిక నేతలు కలిసి ఆందోళన చేశారు.

రోజుకు 8 గంటల పనిదినాలను 12 గంటలకు మార్చాలని కొన్ని రాష్ట్రాలు కోరడం బాధాకరమని నేతలు ఆగ్రహించారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టం చేశారు. లాక్ డౌన్ సమయంలో కార్మికులను ఆదుకోవాల్సింది పోయి వారి కడుపు కొట్టే విధంగా ప్రయత్నాలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details