కడప జిల్లా పులివెందులలో అనుమానంతో భార్యను కిరాతకంగా హతమార్చాడు భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన వీరమ్మకు పులివెందుల రోటరీపురానికి చెందిన అశోక్‌కు 3 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొన్నిరోజుల తర్వాత నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు అశోక్.
ఈ విషయమై వారిద్దరి మధ్య పలుమార్లు పెద్దమనుషుల పంచాయతీ జరిగింది. అయినా మారని అశోక్ 3 రోజుల క్రితం భార్యను చంపి శిల్పారామం సమీపంలో పూడ్చిపెట్టాడు. వీరమ్మ మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అశోక్‌ను విచారించగా నిజం ఒప్పుకున్నాడు. తానే చంపి పూడ్చిపెట్టినట్లు చెప్పాడు.