రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడప జిల్లాలోని రాజుపాలెం మండలంలోని నీటి కుంటలు జలకళ సంతరించుకున్నాయి.సీజన్ ఆరంభంలో వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ రైతులు,ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఊరట పొందుతున్నారు.ఇన్ని రోజులు నీళ్లు లేక వెలవెలబోయిన కుంటలు.చెరువులు కళకళలాడుతున్నందువల్ల పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల వర్షాలతో కడపలో జల కళ
రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో కడప జిల్లా రాజుపాలెంలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.
జల కళను సంతరించుకున్న రాజుపాలెంలోని నీటి కుంటలు