కడప జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది జిల్లాలోని రాయచోటి పులివెందుల రాజంపేట కడప ప్రొద్దుటూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో పంటపొలాల్లోకి వరద నీరు చేరింది. జిల్లాలోని నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు చక్రాయపేట మండలంలో పాపాగ్ని నది, రాయచోటి పట్టణంలోని ఎగువన మాండవి నదిలో వరద ప్రవాహం పెరిగింది. మాండవి నదిపై ఉన్న కంచాలమ్మ గండి చెరువులోకి వర్షపు నీరు చేరడంతో చెరువు కట్ట ను పురపాలక కమిషనర్ రాంబాబు పరిశీలించారు. రాయచోటి పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు.
వెలిగల్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత