Viveka murder case: మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిలు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి.. బెయిల్ కోసం కడప కోర్టులో ఈ నెల 19న పిటిషన్ దాఖలు చేయగా.. సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్.. మార్చి 2వ తేదీకి విచారణ వాయిదా వేశారు.
Viveka murder case: శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
Viveka murder case: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న.. శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. కడప కోర్టులో ఈ నెల 19న పిటిషన్ దాఖలు చేయగా.. సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. మార్చి 2వ తేదీకి విచారణ వాయిదా వేసింది.
కేసులో నాలుగో(A-4) నిందితుడుగా ఉన్న డ్రైవర్ దస్తగిరి గతేడాది ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించిన అంశాలను సీబీఐ తమ వాదనల్లో వినిపించినట్లు సమాచారం. రెండు వైపులా వాదనలు పూర్తి కావడంతో.. విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. అదే రోజు తీర్పు వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా.. దస్తగిరి ఈనెల 21న పులివెందుల కోర్టులో మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలాన్ని కూడా సీబీఐ అధికారులు సీల్డ్ కవర్ లో కోర్టుకు అందజేసినట్లు సమాచారం.