అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట - అగ్రిగోల్డ్
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ. 250 కోట్లు మంజూరు చేసింది. పది వేలు, అంతకన్నా తక్కువ మదుపు చేసిన వారికి తిరిగి చెల్లిస్తామని సీఐడీ అధికారులు వెల్లిడించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ. 250 మంజూరు
తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ. 250 కోట్లు మంజూరు చేసిందని సీఐడీ ఏడీజీ అమిత్ గార్గ్ తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థల ద్వారా బాధితులకు నగదు చెల్లించనున్నారు. పది వేలు, అంతకన్నా తక్కువ మదుపుచేసుకున్న వారు.. తమ డిపాజిట్ బాండ్లను జిల్లా న్యాయసేవాధికార సంస్థల వద్దకు తీసుకెళ్లి నగదు అమిత్ గార్గ్ అన్నారు.