కడపలో గోపాలమిత్రలు గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో సహాయకులుగా ఉంచాలని కోరుతూ గిన్నె పట్టుకుని భిక్షాటన చేశారు. 20 ఏళ్ల నుంచి సేవ చేస్తున్న గోపాలమిత్రులకు ప్రభుత్వం మొండిచేయి చూపడం తగదని గోపాలమిత్ర సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తంచేసారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయం చేయకుంటే ఆత్మహాత్యలు తప్పవన్నారు.
కడపలో గోపాలమిత్రల భిక్షాటనచేస్తూ..నిరసన.
కడపజిల్లా కలెక్టరేట్ ఎదుట గోపాలమిత్రలు గిన్నెలు పట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
gopalamitras ptotests at front of kadapa district collocterate