పట్టపగలే బంగారు గొలుసు చోరీ - police station
కడప జిల్లా బద్వేల్లో పట్టపగలే చోరీ జరిగింది. ఓ వ్యక్తితో మాటలు కలిపిన దొంగలు.. అతని మెడలోని 12గ్రాముల పసిడి గొలుసు, 6గ్రాముల ఉంగరం అపహరించారు.
పట్టపగలే బంగారు గొలుసు చోరీ
కడప జిల్లా బద్వేల్ లో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో పట్టపగలే చోరీ జరిగింది. భావనారాయణ నగర్ కు చెందిన గురవయ్య మామిడిపండ్లు కొనేందుకు వెళ్లారు. గుర్తుతెలియని ముగ్గురు అపరిచిత వ్యక్తులు గురయ్యతో మాటలు కలిపి మెడ మీద మత్తుమందు చల్లారు. ఆ తరువాత మెడలో ఉన్న 12 గ్రాముల బంగారు గొలుసుతో పాటుగా చేతికి ఉన్న ఆరు గ్రాములు బంగారు ఉంగరాన్ని అపహరించారు.