వినాయక నిమజ్జనంలో అపశృతి... వాటర్‌గండిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు - kadapa latest news
17:33 September 12
CDP_Ganesh immersion_Two Students Missing_Breaking
కడప వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు పెన్నానదిలో గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలోని రవీంద్రనగర్‌కు చెందిన చైతన్య, శ్రీనాథ్ ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వీరితో పాటు మరి కొంతమంది యువత వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కడప శివారులోని వాటర్ గండికి వెళ్లారు.
వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో చైతన్య, శ్రీనాథ్‌లు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. మరొక యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గల్లంతైన వారి కోసం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పిల్లల కోసం కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి: