ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొనసాగుతున్న గండికోట నిర్వాసితుల ఆందోళన - గండికోటప్రాజెక్టు వార్తలు

తాళ్ల పొద్దుటూరు గ్రామంలో గండికోట నిర్వాసితుల ఆందోళన 9వ రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని...తమ డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

gandikota project victims Protest
gandikota project victims Protest

By

Published : Sep 11, 2020, 4:35 PM IST

కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో గండికోట నిర్వాసితుల ఆందోళన కొనసాగుతోంది. 9వరోజు మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులకు సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు. వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, కటాఫ్ డేట్ పెంచాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details