కరోనా కాలంలో అంత్యక్రియలంటేనే బంధుగణంతో పాటు సామాన్య జనం భయపడుతున్నారు. అలాంటి ఘటనే కడప జిల్లా దువ్వూరులో జరిగింది. నాగేంద్ర శ్రేష్టి అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఒంగోలులో ఉంటున్న కుమార్తై వద్దకు భార్యతో కలిసి వెళ్లాడు. పరిస్థితి విషమించడంటో ఆయన అక్కడ మృతి చెందాడు. మృతదేహాన్ని వెంటనే స్వస్థలమైన దువ్వూరుకు తీసుకువచ్చారు.
కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో అంత్యక్రియలకు బంధుగణం ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాలేదు. స్థానికులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి ముందుకొచ్చారు. పారిశుద్ధ్య కార్మికుడు సహాయంతో పీపీఈ కిట్ ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.