ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబులెన్స్​లో మంటలు.. గ్యాస్ సిలిండర్​ పేలుడుతో ప్రమాదం - కడప అంబులెన్స్ అగ్నిప్రమాదం

ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద అంబులెన్స్ దగ్ధమైంది. అంబులెన్స్​లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాదం సంభవించింది.

fire in ambulance at prodduturu.. no causalities
fire in ambulance at prodduturu.. no causalities

By

Published : Aug 17, 2021, 10:54 AM IST

Updated : Aug 17, 2021, 1:28 PM IST

కడప జిల్లా పొద్దుటూరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెడినోవా ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ దగ్ధమైంది. అంబులెన్స్​కు ఎల్పీజీ గ్యాస్​ను ఎక్కిస్తుండగా లీకేజీ కావడంతో ప్రమాదం జరిగింది. సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించి అంబులెన్స్ వాహనం పూర్తిగా దగ్ధమైంది.

ప్రమాద స్థల సమీపంలో పాఠశాల, కళాశాల ఉన్నాయి. విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరికి ఎలాంటి అపాయం జరక్కపోవడతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు.

Last Updated : Aug 17, 2021, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details