జిల్లా పోలీసు సహాయనిధికి మాజీ మంత్రి విరాళం - ఇళ్లల్లో ఉంటేనే కరోనాను కట్టడి చేయెచ్చన్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే ప్రజలంతా లాక్‌డౌన్‌ను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.
శానిటైజర్లను అందజేస్తున్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మాజీమంత్రి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి అన్నారు. కరోనా వైరస్‌ను జ్వరం, జలుబు అనుకుని తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదని చెప్పారు. కరోనా నియంత్రణకు తనవంతు సాయంగా... కడప జిల్లా కలెక్టరేట్‌కు 5 వేలు, ఎస్పీ కార్యాలయానికి మరో 5 వేల శ్యానిటైజర్ సీసాలను ఉచితంగా అందించారు. కడప జిల్లా పోలీసు సహాయ నిధికి 2 లక్షల రూపాయలు అందజేశారు.