ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''పదోన్నతుల్లో నిబంధనలు పాటించరా?''

రాయలసీమలో నాలుగో తరగతి బోధనేతర సిబ్బందికి ఇవ్వాల్సిన పదోన్నతుల విషయంలో... సరైన నిబంధనలు పాటించడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కడప ఇంటర్మీడియట్ ఆర్జేడీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

ఉద్యోగులు

By

Published : Jul 18, 2019, 3:13 AM IST

పదోన్నతుల్లో సరైన నిబంధనలు పాటించండి

కడపలోని ఇంటర్మీడియట్ ఆర్జేడీ కార్యాలయం ముందు నాలుగోతరగతి బోధనేతర ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రాయలసీమలో తమకు ఇవ్వాల్సిన పదోన్నతి విషయంలో సరైన నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. అనంతపురం జిల్లా నుంచి 13 మంది, చిత్తూరు నుంచి 20 మంది, కర్నూలు నుంచి 19 మంది, కడప నుంచి 14 మంది హాజరయ్యారు. కౌన్సెలింగ్ నిమిత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం ఆవరణలోనే ఉన్నా... ఎలాంటి ప్రక్రియ చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు ఇచ్చిన సమాచారం మేరకే.. కౌన్సెలింగ్ కు హాజరయ్యామని చెప్పారు. ఇన్ చార్జ్ ఆర్జేడీతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు పదోన్నతులు నిర్వహిస్తానని ఆర్జేడీ అంగీకరించగా.. ఆందోళన విరమించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details