ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలు... నిండుకుండల్లా జలాశయాలు

ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడప జిల్లాలో గండికోట, మైలవరం జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

heavy rains in kadapa
కడప జిల్లాలో భారీ వర్షం

By

Published : Sep 14, 2020, 2:35 PM IST

కడప జిల్లా జమ్మలమడుగులో రాత్రంతా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు నీటమునిగాయి. ఎగువ నుంచి గండికోట జలాశయానికి 9 వేల 600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఆనకట్టలో ప్రస్థుత నీటి నిలువ 12.62 టీఎంసీలుగా ఉంది.

గండికోట నుంచి మైలవరానికి 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మైలవరానికి 3 వేల 500 క్యూసెక్కుల వర్షపునీరు చేరుతోంది. జలాశయం మొత్తం ఇన్ ఫ్లో 18 వేల 500 క్యూసెక్కులుగా ఉంది. మైలవరం ప్రాజెక్టు నుంచి పెన్నానదికి 5 గేట్ల ద్వారా 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details