కడప జిల్లా మైలవరంలో విషాదం చోటు చేసుకుంది. కొంతమంది ఓ వాహనంలో గుర్రప్ప స్వామిని దర్శించుకునేందుకు బయల్దేరారు. కాసేపట్లో ఆలయానికి చేరుకోనున్నారు. ఈ లోగా వాహన చోదకుడు ఓబులేసు(40)కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో స్టీరింగ్ వదిలిపెట్టాడు. ఆ వాహనం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న 15 ఏళ్ల యువకుడు సుభాష్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు అయినట్లు మైలవరం ఎస్ఐ తెలిపారు.
చోదకునికి గుండెపోటు.. ఇద్దరి మరణం - cuddapah district
ప్రయాణంలో ఉండగా వాహన డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ఈ ఘటన.. అతనితో పాటు.. మరో వ్యక్తి మరణానికి కారణమైంది.
చోదకుని గుండెపోటుతో యువకున్ని ఢీకొట్టిన వాహనం