కడప జిల్లా బద్వేలు మండలం చింతల చెరువులో వీధికుక్కల దాడిలో దుప్పి మృతి చెందింది. వేసవి కాలం కావటంతో ఆహారం నీళ్ల కోసం అడవి నుంచి చింతల చెరువు గ్రామ వ్యవసాయ పొలాల్లోకి దుప్పి వచ్చింది. అక్కడే ఉన్న కుక్కలు దుప్పిని వెంబడించి దాడి చేసి చంపాయి. విషయం తెలుసుకున్న బద్వేలు అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి వెళ్లి దుప్పికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అంత్యక్రియలు జరిపారు.
వీధి కుక్కల దాడిలో దుప్పి మృతి - dogs attack on deer
కడప జిల్లా బద్వేలులో వీధి కుక్కల దాడికి ఓ దుప్పి చనిపోయింది. నీళ్ల కోసం బయటకు వచ్చిన దుప్పి కుక్కల చేతిలో బలైపోయింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు దుప్పికి పోస్టుమార్టం చేసి అంత్యక్రియలు జరిపారు.
deer died in kadapa dst badvel due dogs attack