లాక్డౌన్ విధులకే పరిమితం కాకుండా కరోనా పాజిటివ్ బాధితులకు అండగా ఉంటామని కడప డీఎస్పీ సూర్యనారాయణ స్పష్టం చేశారు. నగరంలోని ఫాతిమా కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన...కేంద్రానికి కావాల్సిన సామాగ్రిని అందజేశారు. బాధితులకు భోజన వసతులతో పాటు ఆహ్లాదం కోసం వైఫై, టీవీ ఏర్పాటు చేశామన్నారు. కరోనా బాధితులకు కడప పోలీసులు శాఖ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.
కరోనా బాధితులకు అండగా ఉంటాం: కడప డీఎస్పీ - కరోనా తాజా వార్తలు
కడప పోలీసు శాఖ తరపున కరోనా బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కడప డీఎస్పీ సూర్యనారాయణ స్పష్టం చేశారు. లాక్డౌన్ విధులకే పరిమితం కాకుండా వారికి అండగా ఉంటామన్నారు.
కరోనా బాధితులకు అండగా ఉంటాం