కడప జిల్లా జమ్మలమడుగు మండలం సిరిగేపల్లె గ్రామానికి చెందిన బాలింతకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. గత నెల 25న జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రిలో ఆమె కాన్పు కోసం చేరారు. 26న వైద్యులు ప్రసవం చేసి... 28న డిశ్చార్జ్ చేశారు. ఈనెల 10న సిరిగేపల్లె గ్రామంలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటివ్‌గా తేలింది.
బాలింతకు కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన యంత్రాంగం
కడప జిల్లా జమ్మలమడుగు మండలం సిరిగేపల్లె గ్రామానికి చెందిన బాలింతకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అప్రమత్తమైన అధికారులు ఆమెను కడప ఆసుపత్రిలో చేర్పించారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
కడపలో బాలింతకు కరోనా పాజిటివ్
అప్రమత్తమైన అధికారులు... జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు గ్రామంలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలో బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు. బాలింతను కడప తరలించగా.. కుటుంబ సభ్యులు పదిమందిని జమ్మలమడుగు పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.