కడప జిల్లా మైలవరం మండలం నవాబుపేటలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం ఒక్క రోజే 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు 27 కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 53 చేరుకున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటం అధికారులకు సవాలుగా మారుతుంది.
నవాబుపేటలో కోరలు చాచిన కరోనా...ఒక్కరోజే 26 కేసులు..!
కడప జిల్లా నవాబుపేటలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో గ్రామంలో నిన్న ఒక్కరోజే 26 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మెుత్తం కేసుల సంఖ్య 53కు చేరుకుంది.
నవాబుపేటలో కోరలు చాచిన కరోనా...ఒక్కరోజే 26 కేసులు నమోదు !
నవాబుపేట గ్రామంలో 1000 మందికి పైగా జనాభా ఉన్నారు. ఇప్పటికీ సగం మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మిగిలిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తే ఎన్ని కేసులు బయటపడతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం జిల్లా ఎస్పీ అన్బురాజన్, సంయుక్త కలెక్టర్ సాయి కాంత్ వర్మ గ్రామంలో పర్యటించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఇప్పటికే ఆ గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేశారు.