రెండు రోజుల్లో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కడప జిల్లా నవాబుపేటవాసులు ఆందోళనకు గురవుతున్నారు. పట్టణంలో ఈనెల 3న 10 పాజిటివ్ కేసులు నమోదు కాగా..4న 13 కేసులు నిర్ధరించారు. మే నెల చివరి వారంలో రెండు కేసులతో కలిపి మొత్తం నవాబ్‌పేటలో 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
రెండు రోజుల్లో 23 కేసులు...అప్రమత్తమైన అధికారులు - రెండు రోజుల్లో 23 కేసులు...అప్రమత్తమైన అధికారులు
కడప జిల్లా నవాబుపేటలో రెండు రోజుల వ్యవధిలో 23 కేసులు నమోదు కావటంతో ఆ ప్రాంతవాసులు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు కరోనా నిరోధక చర్యలు చేపట్టారు.
రెండు రోజుల్లో 23 కేసులు...అప్రమత్తమైన అధికారులు
ఒక చిన్న గ్రామంలో 25 కేసులు నమోదు కావటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నవాబుపేటను సందర్శించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్ అధికారులకు పలు సూచనలు చేశారు. చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. వైద్య బృందం మరో 100 మందికి పరీక్షలు నిర్వహించారు.